నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక లెజెండరీ పర్సన్ అని అందరికి తెలుసు..ఒకవైపు వరుస సినిమాలు, మరో వైపు రాజకీయాల్లో, ఇప్పుడు షో తో జనాలకు ఎప్పుడూ దగ్గరగా ఉన్నాడు బాలయ్య.. అన్‌స్టాపబుల్ షో ద్వారా తనలోని మరో కోణాన్ని బయట పెట్టారు. స్టార్ సెలెబ్రేటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో తెలియని విషయాలను తెలియజేశారు. ఈ సీజన్ మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేశారు..ఇప్పుడు రెండో సీజన్ జరుపుకుంటున్నారు..
జనాలు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్నా ఓ వార్త ఇప్పుడు వారికి సంతోషాన్ని కలిగిస్తుంది...ఇది ఒక కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి..అన్‌స్టాపబుల్ సీజన్ 2కు పవన్ కల్యాణ్ రాబోతున్నట్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఈ వార్త అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. ఇద్దరు మాస్ హీరోలు ఏం మాట్లాడుకుంటారు.. బాలయ్య, పవన్‌ను ఎలా ఆటపట్టిస్తారా.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నది కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది. డిసెంబర్ ఎండింగ్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ కోసం ఆసక్థిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
అయితే తాజాగా ఓ పిక్ తెగ వైరల్ అవుతుంది. వీరసింహారెడ్డి సెట్స్‌లో బాలయ్యను కలిశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ శృతి హాసన్, మైత్రి ప్రొడ్యూసర్ రవి తో పాటు మరి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు.గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న వీరసింహా రెడ్డి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్నాడు.వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లను చేస్తున్నారు.