
బాస్ పార్టీకి సమాధానం ఇవ్వబోతున్న మా బావ మనోభావాలు !
ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి బాలకృష్ణ ‘మా బావ మనోభావాలు’ తో క్రిస్మస్ పండుగను షేక్ చేయబోతున్నాడు. ‘వీరసింహా రెడ్డి’ మూవీలోని ఈ ఐటమ్ సాంగ్ క్రిస్మస్ కు ఒకరోజు ముందు విడుదల చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ కు తమన్ మంచి మాస్ ట్యూన్ ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. ‘బాస్ వేరీజ్ ద పార్టీ’ లో చిరంజీవి మిస్ ఇండియా విజేత ఊర్వశీ రౌతాల తో చిందులు వేస్తే బాలకృష్ణ నేనేమి తక్కువ కాదు అంటూ ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలో ఫ్యాషన్ క్వీన్ గా ఒక వెలుగు వెలుగుతున్న చంద్రిక రవితో రెచ్చిపోయి స్టెప్స్ వేసాడట.
ఇప్పటికే చంద్రిక రెండు మూడు తమిళ సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు చెప్పుకోతగ్గ గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు ఆమె ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది. ఈ ఐటమ్ సాంగ్ లో బాలకృష్ణ 25 డాన్సర్స్ మధ్య వెరైటీ కాస్ట్యూమ్స్ వేసుకుని తన మాస్ లుక్ ను చూపించబోతున్నాడని టాక్.
సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ సినిమాల ఐటమ్ సాంగ్ పోటీ ఒక రేంజ్ లో కొనసాగుతూ ఉంటే చిరంజీవి బాలకృష్ణల కంటే 30 సంవత్సరాలకు పైగా తేడా వయసులో ఉన్న శృతి హాసన్ ఈ ఇద్దరి టాప్ హీరోల సంక్రాంతి సినిమాలలో హీరోయిన్ గా ఉండటంతో వచ్చే సంవత్సరం అంతా శృతి హాసన్ హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా రాబోయే కొత్త సంవత్సరంలో విడుదలయ్యే సినిమాలతో శృతి హాసన్ కు టర్నింగ్ పాయింట్ అనుకోవాలి..