రానా బాలకృష్ణ ల మధ్య తేల్చుకోలేకపోతున్న స్టార్ మా !

Seetha Sailaja
‘బిగ్ బాస్ సీజన్ 6’ పూర్తి అయి వారం రోజులు కూడ అవ్వకుండానే సీజన్ 7 గురించి ఆలోచనలు అభిప్రాయాలు గాసిప్పులు అప్పుడే మీడియాలో మొదలైపోయాయి. లేటెస్ట్ గా ముగిసిన ‘బిగ్ బాస్ సీజన్ 6’ రేటింగ్స్ విషయంలో స్టార్ మా యాజమాన్యం ఆశించిన రేంజ్ కి వెళ్ళలేకపోయింది అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. ఆ గాసిప్పులను స్టార్ మా ఖండించింది.

ఇప్పుడు హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రాబోతున్న సమ్మర్ లో సీజన్ 7ను ప్రారంభించాలని బిగ్ బాస్ టీమ్ అప్పుడే తమ ఆలోచనలతో రంగంలోకి దిగింది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున రాబోతున్న సీజన్ 7కు హోస్ట్ చేసే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడంలేదు అన్న లీకులు వస్తున్నాయి.

దీనితో రాబోయే సీజన్ ను హోస్ట్ చేయగల ఒక ప్రముఖ సెలెబ్రెటీ కోసం ఇప్పటి నుండే స్టార్ మా యాజమాన్యం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు స్టార్ మా యాజమాన్యం దృష్టిలో ఈషోను హోస్ట్ చేయగల సమర్థత రానా కు లేదంటే బాలకృష్ణకు ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానా ఇప్పటికే బుల్లితెర పై కొన్ని కార్యక్రమాలు హోస్ట్ చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా రానా అన్నివిధాల సరిపోతాడని స్టార్ మా యాజమాన్యం ప్రాధమిక ఆలోచన అని తెలుస్తోంది.

అయితే స్టార్ మా ఆలోచనలలో నందమూరి సింహం బాలకృష్ణ కూడ ఉన్నాడని టాక్. ‘అన్ ష్టాపబుల్’ షోను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న బాలకృష్ణ గురించి కూడ స్టార్ మా యాజమాన్యం ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ‘బిగ్ బాస్’ షో నిర్వహించే వ్యక్తికి చాల ఓర్పు ఉండవలసిన పరిస్థితులలో అలాంటి ఓర్పును బాలకృష్ణ చూపెట్టగలడా అన్న సందేహాలు కూడ కొందరు స్టార్ మా యాజమాన్యం వద్ద ప్రస్తావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: