స్లోగా "ఆర్ సి 15" షూటింగ్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రామ్ చరణ్ "ఆచార్య" మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం ఒక బ్లాక్ బస్టర్ మూవీ తో , ఒక ఫ్లాప్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.


ఇది ఇలా ఉండే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియరా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు జరిగిపోయింది. కొంత కాలం క్రితం వరకు ఈ మూవీ షూటింగ్ ను శంకర్ ఫుల్ స్పీడ్ లో తెరకెక్కించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ మూవీ షూటింగ్ అంత స్పీడ్ గా జరగడం లేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ న్యూజిలాండ్ లో ఒక సాంగ్ ను మరియు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: