ఇక
అల్లు అర్జున్ -
సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప
సినిమా గత ఏడాది విడుదలై
బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే..తెలుగు వెర్షన్ జస్ట్ యావరేజ్ కాగా ఈ సినిమాని హిందీలోనే మాత్రం ఎగబడిమరీ చూసారు..మలయాళం ,
కన్నడ ఇంకా
తమిళ బాషలలో కూడా ఈ
సినిమా పర్వాలేదనిపించింది..RRR ,
బాహుబలి ,
kgf వంటి సినిమాల తర్వాత ఈ
సినిమా కూడా దేశావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలోని పాటలు, ..'తగ్గేదే లే' అనే మ్యానరిజం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతీ ఒక్కరు తగ్గేదేలే మ్యానరిజం ని సందర్భాన్ని బట్టీ తెగ వాడేశారు..అయితే ఈ సినిమాని కొద్దీ రోజుల క్రితమే రష్యాలోని
మాస్కో లో నిర్వహించిన
అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
దీనితో ఈ సినిమాని
రష్యా దేశం మొత్తం ఘనంగా విడుదల చెయ్యాలని
మూవీ టీం మొత్తం అక్కడ ప్రొమోషన్స్ లో భాగంగా వారం రోజుల పాటు
రష్యా లోనే మకాం వేశారు.RRR
జపాన్ లో ఎలా అయితే క్లిక్ అయ్యిందో, అలా ఈ
సినిమా కూడా
రష్యా లో దుమ్ము లేపేస్తుందని అనుకున్నారు.కానీ
రష్యా లో
ఇండియన్ సినిమాలకు అసలు
మార్కెట్ లేదనే విషయం పుష్ప
మూవీ టీం కి తెలియనట్టుంది..ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారని ఈ సినిమాని తప్పుగా అంచనా వేశారు.ఏకంగా 8 కోట్ల రూపాయిల దాకా ప్రొమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేసారు..కానీ విడుదలై వారం రోజులకి కనీసం 8 లక్షల రూపాయిలను కూడా ఈ
సినిమా వసూలు చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాని బన్నీని సోషల్
మీడియా లో నెటిజెన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..ఇక పుష్ప పార్ట్ 2
మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.