సమంత లక్ విజయ్ కు కలిసి వస్తుందా...?
దీనికి గల కారణం వారు తీసే రోమాంటిక్ సినిమా ఖుషి,,. సమంత కు మజిలీ, ఓ బేబీ, సూపర్ హిట్ తర్వాత మళ్లీ హిట్టు అయితే దొరకలేదు. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్, లో నటించిన సమంతకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. దీంతో ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఇటీవల వచ్చిన యశోద సినిమా మీద కూడా సమంత చాలా నమ్మకం అయితే పెట్టుకుంది.
కాని ఊహించని విధంగా ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడినప్పటికీ సినిమా మాత్రం కమర్షియల్ గా అయితే హిట్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రోడక్షన్ లో ఉన్న శాకుంతలం పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇంకా విజయ్ దేవరకొండ, విషయానికొస్తే గత కొన్నేళ్లుగా ప్లాప్ లను మూటకట్టుకుంటూ వస్తున్నాడు. ఇక రీసెంట్గా పూరి జగన్నాధ్, , దర్శకత్వం లో వచ్చిన లైగర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ మొదటిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా లైగర్..
సినిమాపై వీరు భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో విజయ్ మరియు పూరి జగన్నాథ్ పరువు మొత్తం పోయేలా అయితే చేసింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు సమంత ఎలాగైనా హిట్టు కొట్టాలని నమ్మకంతో కలిసి చేస్తున్న సినిమా ఖుషి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనూహ్యంగా పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడు మరలా రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం వీరిద్దరి టైం బ్యాడ్ గా ఉండడంతో ఎవరివల్ల ఎవరికి ప్లేస్ అవుతుందో అనేది ఈ సినిమా రిలీజ్ అయితే కానీ మరి తెలియదు.