పఠాన్: దీపికా.. ఆ బికినీ ఏందీ.. ఇక మీరు మారరా?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా చెప్పుకుంటోన్న సినిమా పఠాన్. కొన్నాళ్లుగా అస్సలు ఒక్కయావరేజ్ హిట్టూ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు షారుఖ్. ఒకప్పుడు బాక్సాఫీస్ బాద్ షాగా చెప్పుకున్నా ఈయన ఇప్పుడు మాత్రం ఒక హిట్ కోసం  పక్షిలా చూస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పఠాన్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు.బడా నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న సినిమా ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తర్వాత షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అని హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి బేషరమ్ అనే పాటను రిలీజ్ చేశారు. పాటకు తగట్టుగానే దీపికా డ్రెస్సింగ్ అంతా కూడా బేషరమ్ గా ఉంది. ఈమె పాటంతా బికినీలోనే ఎక్కువగా కనిపించింది. ఆల్రెడీ మరో స్టార్ హీరో అయిన రణ్‌వీర్ సింగ్ ను పెళ్లి కూడా చేసుకున్న దీపిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందని అసలు ఎవరూ భావించలేదు. అయితే పాటలో చూపిన మూమెంట్స్ తో పాటు డ్రెస్సింగ్ కూడా అసభ్యతను దాటి చాలా దారుణంగా ఉందని చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా కూడా అలాగే ఉంది.


షారుఖ్ ఖాన్ కు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.వారు సినిమాకు రావాలంటే మరీ ఇలాంటి దిగజారుడు మూమెంట్స్ ఉంటే చాలా ఇబ్బంది పడతారు కూడా. ఇటు దీపికా కూడా ఆ మధ్య చేసిన గెహ్రైయాన్ అనే సినిమాలో ఓ రేంజ్ ఇంటిమేట్ సీన్స్ తో బాగా రెచ్చిపోయింది. అయితే అది ఒక రకంగానే కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం చాలా అసభ్యంగా ఉందంటున్నారు. మరి మొగుడిగా రణ్‌వీర్ సింగ్ రెస్పాన్స్ ఏంటో కానీ.. ఇప్పుడీ సినిమాలోని ఆ పాటను తొలగించకపోతే మా రాష్ట్రంలో విడుదల కానివ్వం అంటూ మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల పొలిటీషియన్స్ కూడా హెచ్చరిస్తున్నారు. పైగా ఈ పాటలో ఈ బ్యూటీ ఏకంగా కాషాయపు రంగు బికినీ ధరించి అన్ని చూపించడంతో హిందువులు రెచ్చిపోతున్నారు. అసలు హిందువులను కావాలనే రెచ్చగొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారా అంటూ నెటిజన్స్ ఈ సినిమాని ముఖ్యంగా దీపికాని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.జనవరి 25న విడుదల కాబోతోన్న పఠాన్ నుంచి ఈ పాటను తొలగిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: