ప్రభాస్ కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలకృష్ణ..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం కూడా అయింది.


ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అనే టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ టాక్ షో కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ టాక్ షో కు ప్రభాస్ మరియు గోపీచంద్i ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ టాక్ లో భాగంగా బాలకృష్ణ , ప్రభాస్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ టాక్ షో లో భాగంగా రామ్ చరణ్ కు బాలకృష్ణ ఫోన్ చేసి ప్రభాస్ కు సర్ప్రైజ్ చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రామ్ చరణ్ , ప్రభాస్ ఒక లేటెస్ట్ సినిమా గురించి మరియు ఇతర విషయాల గురించి చెప్పినట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ మరియు గోపీచంద్ లకు సంబంధించిన ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30 లేదా 31 వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: