"వీర సింహారెడ్డి" రన్ టైమ్ ను లాక్ చేసిన మూవీ యూనిట్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అటు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే , ఇటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.


మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ లో దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఒక పాటను వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ ను రేపు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని 2 గంటల 43 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: