టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురరామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో
మూవీ లకు దర్శకత్వం వహించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే
టాలీవుడ్ యంగ్
హీరో విజయ్
దేవరకొండ తో
పరుశురామ్ "గీత గోవిందం" అనే
మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ లో
రష్మిక మందన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో
పరశురామ్ ఇమేజ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు
మూవీ కి దర్శకత్వం వహించాడు.
పరశురామ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే
మూవీ ని తెరకెక్కించాడు. ఈ
మూవీ మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే
పరశురామ్ తన తదుపరి
మూవీ ని నందమూరి నటసింహం
బాలకృష్ణ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు
బాలకృష్ణ కోసం ఒక అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీ ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.