సాయి తేజ్ టైటిల్ పై పవన్ అభిమానులకు నిరాశ !

Seetha Sailaja
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన యాక్సిడెంట్ నుండి కోలుకుని నటించిన మొట్టమొదటి సినిమా ‘విరూపాక్ష’ టైటిల్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయస్ ఓవర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ గా మారింది.

మూఢనమ్మకాలకు వాస్తవానికి మధ్య ఉన్న తేడాను తెలిపే విధంగా ఈమూవీ కథ ఉంటుందని ఈ టీజర్ చూసిన వాడికి అర్థం అవుతోంది. ఈమధ్య కాలంలో దేవుడు దెయ్యాలు చుట్టూ తిరిగే మూవీ కథలకు మంచి స్పందన వస్తోంది. దీనితో ఈ ట్రెండ్ ను నమ్ముకుని సాయి తేజ్ నటిస్తున్న మూవీకి ‘విరూపాక్ష’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ టీజర్ విడుదలైన కొద్ది సేపటికే పవన్ అభిమానులు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. ఈ టైటిల్ పవన్ కోసం క్రిష్ అనుకున్న టైటిల్ అని ఇప్పుడు ఆ టైటిల్ ను మెగా మేనల్లుడు కబ్జా చేసాడు అంటూ జోక్ చేస్తున్నారు. ఇలా వారు జోక్ చేయడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పవన్ క్రిష్ ల ‘హరి హర వీరమల్లు’ మూవీకి మొదట్లో ‘విరూపాక్ష’ అన్న టైటిల్ పెడదామని క్రిష్ భావించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో లీకులు కూడ వచ్చాయి.

అయితే ఆతరువాత ఆ టైటిల్ ను పెట్టకుండా ఆమూవీకి ‘హరి హర వీరమల్లు’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఆవిషయాన్ని బయటకు తీస్తూ పవన్ అభిమానులు సాయి తేజ్ సినిమాకు పవన్ సినిమా టైటిల్ ను వాడారు అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు. వాస్తవానికి పవన్ తన కుటుంబ సభ్యులలో ఎవరితోనూ పెద్దగా సన్నిహితంగా ఉండనప్పటికీ సాయి తేజ్ పట్ల చాల అభిమానాన్ని చూపెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ అభిమానం చనువుతోనే తేజ్ పవన్ టైటిల్ ను తన సినిమాకు వాడుకుంటున్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: