ఇంతవరకు అలాంటి సినిమా ఎప్పుడు చేయలేదు... రామ్ పోతినేని..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఇప్పటికే అనేక విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ఈ సంవత్సరం ది వారియర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.


ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే రోజు విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా ది వారియర్ మూవీ తో ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయిన రామ్ పోతినేని ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ గురించి చెబుతూ ... ఇంత వరకు నా కెరియర్ లో ఈ రేంజ్ ఊర మాస్ సినిమా ఎప్పుడు చేయలేదు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: