టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరోలలో ఒకరు అయినటు వంటి
సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సంతోష్ శోభన్ ఇప్పటికే అనేక
మూవీ లలో
హీరో గా నటించి తనకంటూ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.
సంతోష్ శోభన్ ఆఖరుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా ఈ రోజు నుండి
సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్
మూవీ తో ప్రేక్షకులను పలకరించిన
సంతోష్ శోభన్ వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా తన మరో
మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం
సంతోష్ శోభన్ "కళ్యాణం కమనీయం" అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
సంతోష్ శోభన్ సరసన ప్రియ భవాని
శంకర్ హీరోయిన్ గ నటిస్తుండగా ,
అనిల్ కుమార్ అల్లా ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ ని యు
వి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీని వచ్చే సంవత్సరం
జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.