గూగుల్ లో ఈ సంవత్సరం ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
తాజాగా గూగుల్ సంస్థ ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో నెటిజన్ లు ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. ఇలా తాజాగా గూగుల్ విడుదల చేసిన సినిమాల లిస్ట్ లో కొన్ని సినిమాలు వివాదాల వల్ల ట్రెండ్ అయితే ... మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ సాధించి , కలెక్షన్ లు మరియు ఇతర కారణాల వల్ల ట్రెండ్ అయ్యాయి. తాజాగా గూగుల్ విడుదల చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.


తాజాగా గూగుల్ విడుదల చేసిన లిస్ట్ లో బ్రహ్మాస్త్ర మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని , మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఆ తర్వాత కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ నిలిచింది. ఆ తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ నిలిచింది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలిచింది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఆ తర్వాత కాంతారా మూవీ నిలిచింది. ఆ తర్వాత పుష్ప ది రైస్ మూవీ నిలిచింది. ఆ తర్వాత విక్రమ్ ,  లాల్ సింగ్ చడ్డ , దృశ్యం 2 ,  దోర్ లవ్ అండ్ దండర్ మూవీ లు నిలిచాయి. ఇలా తాజాగా ఈ సంవత్సరం గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన మూవీ ల లిస్ట్ లో ఈ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: