తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఈ
హీరో కు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. తాజాగా సిద్దు జొన్నలగడ్డ ఈ సంవత్సరం
డీజే టిల్లు
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
నేహా శెట్టి ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఈ
మూవీ కి అద్భుతమైన లాభాలు కూడా లభించాయి.
ఈ
మూవీ ద్వారా సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా డిజె టిల్లు
మూవీ మంచి విజయం సాధించడం తో , ఈ
మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే
మూవీ ని సిద్దు జొన్నలగడ్డ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు ఆ తర్వాత ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ను
హీరోయిన్ గ సెలెక్ట్ చేసుకున్నట్లు కూడా
మూవీ యూనిట్ ప్రకటించింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ
మూవీ నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఆ తర్వాత ఈ
మూవీ లో మడోనా సబాష్టియన్
హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఈ ముద్దు గుమ్మ ను చిత్రం బృందం తాజాగా లుక్ టెస్ట్ చేయగా ఈ
మూవీ యూనిట్ ఈ లుక్ టెస్ట్ లో అంత సాటిస్ఫై గా లేకపోవడంతో ఈ ముద్దు గుమ్మ ను కూడా ఈ
మూవీ నుండి తప్పించినట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.