తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మ్యూజిక్
డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవి
శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఎన్నో సూపర్ ... డూపర్ ... బ్లాక్ బాస్టర్
మూవీ లకు సంగీతాన్ని అందించి అలాగే ఎన్నో ఆల్బమ్ లను సూపర్ హిట్ గా చేసి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్
డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. అలాగే ఇప్పటికే దేవి
శ్రీ ప్రసాద్ ఎన్నో
మూవీ లకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ను కూడా అందించి ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించాడు. అలా ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించిన దేవి
శ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు దాదాపు 4 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే కొంత మంది అద్భుతమైన సంగీతాన్ని అందించి
సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తూ ఉండే దేవి
శ్రీ ప్రసాద్ కు 4 కోట్ల రెమ్యూనిరేషన్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం దేవి
శ్రీ ప్రసాద్ ,
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా , ఆ పాటకు సూపర్ క్రేజ్ లభిస్తుంది. ఈ పాటలో దేవి
శ్రీ ప్రసాద్ కూడా కనిపించాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో దేవి
శ్రీ ప్రసాద్ , ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పుష్ప పార్ట్ 2
మూవీ కి కూడా సంగీతం అందించబోతున్నాడు. ఈ
మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.