ఇది ఇలా ఉంటే
పూజ హెగ్డే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ ముద్దు గుమ్మ ఈ
మూవీ రెండవ షెడ్యూల్ లో జాయిన్ కావాల్సి ఉంది. కాకపోతే
పూజ హెగ్డే ప్రస్తుతం ఈ
మూవీ కి డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. దానితో ఈ
మూవీ షూటింగ్ లో
పూజా హెగ్డే ఇంకొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ,
పూజ హెగ్డే కాంబినేషన్ లో
మహర్షి మూవీ తెరకెక్కి
బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ
మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.