18 పేజెస్ నుంచి సింగిల్ ట్రాక్ విడుదల.. ఎప్పుడంటే..?
ప్రస్తుతం 18 పేజీస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది . పల్నాటి సూర్య ప్రతాప దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసాయి. ఈ సినిమాలో నిఖిల్ భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడవలసిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జిఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తుండడం గమనార్హం. ఇప్పటికే కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కారణంగా కూడా 18 పేజీస్ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ జంటకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది.