తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడు ఎన్నో విజయవంతమైన
మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు సీతా రామం అనే
ప్రేమ కథ చిత్రనికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. దుల్కర్
సల్మాన్ హీరోగా నటించిన ఈ
మూవీ లో మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా నటించింది.
రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో ఈ
మూవీ లో కనిపించగా ,
సుమంత్ ,
భూమిక చావ్లా ,
తరుణ్ భాస్కర్ ,
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ ద్వారా దర్శకుడు హను రాఘవపూడి ,
హీరో దుల్కర్
సల్మాన్ ,
హీరోయిన్ మృనాల్ ఠాకూర్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ
సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బుల్లి తెర పై ప్రసారం అయింది. ఈ
మూవీ సాటిలైట్ హక్కులను
స్టార్ మా సంస్థ దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా స్టార్ మా చానల్లో ప్రసారం కాగా , మొదటి సారి ఈ
మూవీ కి బుల్లితెరపై 8.73 "టి ఆర్ పి" వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ
మూవీ కి సూపర్ రెస్పాన్స్ బుల్లితెర ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు.