చివరిగా వారసుడు మూవీ రిలీజ్ డేట్ లాక్..!
దీంతో తెలుగు స్టార్ హీరోలే కాదు తెలుగు బడా నిర్మాతలు దర్శకులు కూడా దిల్ రాజు ప్రవర్తన పై మండిపడుతున్నారు. కానీ ఆయన మాత్రం తన సినిమా విడుదలపై మరింత అంచనాలు పెంచే విధంగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేయడం జరిగింది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తో వీరిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఇప్పుడు తెలుగు , తమిళ్లోనే కాదు హిందీలో కూడా విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల వాయిదా వేస్తూ రకరకాల తేదీలలో అందరూ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఫార్మ్ ఫిలిం కార్పొరేషన్ 2023 జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేస్తామని ధ్రువీకరించారు. మొత్తానికైతే సినిమా డేట్ ప్రకటించి అభిమానులకు ఊరట కలిగించారు చిత్ర యూనిట్.