బిందాస్ హీరోయిన్ ఇప్పుడు ఎలా వుందో తెలుసా...?

murali krishna
మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ చిత్రం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు  చూసి మాత్రం నవ్వకుండా ఉండలేరు.
మంచు మనోజ్ కు గుర్తింపు వచ్చిన చిత్రాలలో బిందాస్ చిత్రం కూడా ఒకటి. ముఖ్యంగా మంచి కంటెంట్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కి జోడిగా షినా షహబాది హీరోయిన్గా అయితే నటించింది. మంచు మనోజ్ మరదలి పాత్రలో ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంది. షినా అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఏం చేస్తోంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం.
బిందాస్ చిత్రంలో ఎంతో అమాయకంగా అల్లరిగా కనిపించే షినా షహబాది బిందాస్ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపించింది. అలా యాక్షన్ త్రీడీ మరియు నందీశ్వరుడు గడ్డం గ్యాంగ్, నా బంగారం తదితర సినిమాలలో నటించింది. కానీ ఈ చిత్రాలు ఏవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు దీంతో బాలీవుడ్ వైపు తను అడుగులు వేయగా అక్కడ కొంతకాలం బాగానే ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు షినా షహబాది ని అయితే మర్చిపోయారు.
ఇటీవలే ఈ అమ్మడు కు సంబంధించి ఆమె అభిమానుల సైతం నెట్లో తెగ సర్చ్ చేయగా ప్రస్తుతం ఉన్న ఫోటోలను చూసి ఈ ముద్దుగుమ్మ చాలా క్యూట్గా ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. 2015 వరకు సినిమాలను నటించిన ఈమె ఆ తర్వాత పులి టీవీ సీరియల్స్ లో కూడా కనిపించింది. ఆ తర్వాత ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం బాగానే ఆకట్టుకుంటూ ఉంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: