అల్లు
అర్జున్ ఇప్పుడు పాన్
ఇండియా స్టార్ అయ్యాడు..ఈయన
త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన
సినిమా అలా వైకుంఠపురం లో
సినిమా చేశారు.. మాములుగా
త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆయన
సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హీరోతో సంబంధం లేకుండా, ఆయన సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అలాంటి డైరెక్టర్‌తో
సినిమా చేయాలని పలువురు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు.
అయితే
త్రివిక్రమ్ మాత్రం కొంతమంది హీరోలతో సినిమాలను రిపీట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ జాబితా లోనే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా, అవి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురము లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా
అల వైకుంఠపురములో మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక వీరిద్దరు మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లుగా
ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీతో
త్రివిక్రమ్ మరోసారి
సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే బన్నీకి ఆయన ఓ పవర్ఫుల్ కథను వినిపించాడని, ఈ సినిమాకు
బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ వార్తలొ నిజమేంత వుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం
బన్నీ పుష్ప-2 సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అటు త్రివక్రమ్ కూడా తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్టార్ట్ చేశాడు. తమ ప్రస్తుత ప్రాజెక్టుల ను పూర్తి చేసుకున్నాక, మరోసారి బన్నీ-త్రివిక్రమ్ తమ సినిమాను మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ
సినిమా ను 2023 సమ్మర్ తరువాత స్టార్ట్ చేసి, 2024
సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా
త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట..