ప్రముఖ యంగ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన "హిట్ 2:ది సెకండ్ కేస్"
సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్
ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా నేషనల్
డైరెక్టర్ పాన్
ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న
రాజమౌళి హాజరు కాబోతున్నారని తెలిసి.. ఈ ప్రీ రిలీజ్
ఈవెంట్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి.
సైకలాజికల్ యాక్షన్
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ
సినిమా ఆధ్యాంతం సెన్సార్ బోర్డు నిర్వహకులను సైతం ఆకట్టుకుంది. అంతేకాదు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇస్తూ భారీ షాక్ తగిలేలా సినిమాను రూపొందించారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ
ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అగ్ర దర్శకుడు
రాజమౌళి హాజరు కానుండడంతో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాని వాల్
పోస్టర్ బ్యానర్ పై
ప్రశాంతి తిపిరినేనితో కలిసి
హీరో నాని నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే హిట్ ఫస్ట్ కేస్ ప్రీ రిలీజ్
ఈవెంట్ కు
రాజమౌళి గెస్ట్ గా వచ్చాడు . ఆ
సినిమా పెద్ద హిట్ అయింది మరోసారి ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ ప్రీ రిలీజ్
ఈవెంట్ కు రాజమౌళిని గెస్ట్ గా ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యంగా రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ
ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. ఇందులో
హీరోయిన్ గా మీనాక్షి
చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో అడవి శేష్ కృష్ణదేవ్ అలియాస్ కేడి అనే పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.