బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తుంది.. మరికొద్ది రోజుల్లో
బిగ్ బాస్ సీజన్ 6 ముగుస్తుంది. ఇప్పటికే ఎన్నో వివదాలకు కెరాఫ్ గా నిలిచింది.ఈ సారి వచ్చిన వారంతా స్ట్రాంగ్ గా ఉన్నారు... ఈ నేపథ్యంలో టాప్ 5లో ఎవరు ఉంటారు.
విజేత ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక
బిగ్ బాస్ హౌస్ లో ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్స్ లో గ్లామర్
క్వీన్ శ్రీ సత్య ఒకరు. ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక
బిగ్ బాస్ మొదటి
ఎపిసోడ్ నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కంటిన్యూ అవుతోంది ఈ భామ. రీసెంట్ గా
బిగ్ బాస్ హౌస్ లోకి ప్రస్తుతం ఉన్న సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే
శ్రీ సత్య అమ్మ
నాన్న కూడా
హౌస్ లోకి వచ్చారు..అయితే ఆమె అమ్మగారు
హౌస్ లోకి వీల్ చైర్ లో వచ్చారు.శ్రీ సత్యను చూసి ఎమోషనల్ అయ్యారు ఆమె. అయితే ఆమె వీల్ చైర్ కు పరిమితం అవ్వడానికి కారణం
శ్రీ సత్య చేసిన ఒక తెలివితక్కువ పనేనట.
గతంలో
శ్రీ సత్య మాట్లాడుతూ.. తాను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లిపీటలవరకు వెళ్లానని తెలిపింది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత అతడితో
పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న బాధలో
శ్రీ సత్య ఆత్మహత్యకు ప్రయతనించింది. ఆ సమయంలోనే ఆమె అమ్మకు స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది
శ్రీ సత్య. ఇక ఇప్పుడు ఆమె అలా వీల్ చైర్ లో రావడంతో ప్రేక్షకుల
గుండె తరుక్కు పోయింది..ఆమె తల్లిదండ్రులను
హౌస్ లోని వాళ్ళకు పరిచయం చేసింది..