మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ , కియరా అద్వానీ కాంబినేషన్ లో ఇది వరకే
వినయ విధేయ రామ అనే
మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో
మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ
మూవీ ని ప్రముఖ
నిర్మాత డి విvవి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ
మూవీ కి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో
వినయ విధేయ రామ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ
సినిమా లో
రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ జంటకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.