మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య కోల్డ్
వార్ అయితే జరుగుతోంది. బాస్ పార్టీకి కాస్త నెగిటివ్ టాక్ రావడంతో అందరూ కూడా
బాలయ్య వీరసింహారెడ్డి పాట మీద ఫోకస్ కూడా పెట్టేశారు.
ఇదెలా ఉంటుందో అని ఎదురుచూడసాగారు.
తమన్ మీద భారీ అంచనాలతో నందమూరి అభిమానులు కూడా రెడీగా ఉన్నారు. సౌండ్ బాక్సులు పగిలిపోయాయ్ అని
తమన్ కూడా ఓ ట్వీట్ వేశాడు. కానీ
తమన్ చెప్పినట్టుగా మరీ అంత
మాస్ బీటేమీ అయితే కాదు అది.
అలా అని
తమన్ కొట్టింది కొత్త బీట్ మాత్రం అసలే కాదు.
ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌ను జై బాలయ్య.. జై జై
బాలయ్య అంటూ మార్చేశాడు. ఇలా కాపీ ట్యూన్‌ను జనాలు పట్టేసి ఇప్పుడు ట్రోల్స్ అయితే చేస్తున్నారు.ఇలా ట్యూన్లు కాపీ కొట్టడం తమన్‌కు కొత్తేమీ కాదు. ఇది వరకు అయితే తన సినిమాలవి తానే కొట్టేసేవాడు.
బ్లాక్ బస్టర్ పాటను మళ్లీ తిప్పి తిప్పి వాడేశాడు. ఇలా
తమన్ పాటలు వస్తున్నాయంటే ట్రోలర్స్, మీమర్స్ కూడా రెడీగా ఉంటారు.
ఎక్కడి నుంచి లేపేసి ఉంటాడో అని రీసెర్చ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఇలా
తమన్ మళ్లీ అయితే దొరికేశాడు. అసలే బాస్
పార్టీ పాటతో దేవీ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు
తమన్ ఇలా దొరికిపోయి దేవీని కాపాడేశాడు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా
తమన్ మీద పడింది. పైగా
తమన్ ఈ లిరికల్ వీడియోలో కొత్తగా కూడా కనిపించాడు.
లిరికల్ వీడియోలో
తమన్ మరింత హుషారుగా అయితే కనిపించాడు. వేషాధారణ మార్చేశాడు. తెల్లచొక్క, బంగారం వేసుకుని కనిపించాడు.
మాస్ స్టెప్పులు వేశాడు. ఇవన్నీ చాలా కొత్తగానే చేశాడు. కానీ ట్యూన్ మాత్రం కొత్తగా ఉందా? లేదా? అని చూసుకోలేదు. దీంతో కింగ్‌లో జయ
సూర్య టైపులో అందరూ ఏకిపారేస్తున్నారుట.నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టిలో సగం స్వరాలంకరణలో పెట్టి ఉంటే బాగుండేదన్నట్టుగా కామెంట్లు కూడా చేస్తున్నారు.
చివరకు బాస్
పార్టీ మరియు జై
బాలయ్య రెండూ కూడా ఓ మోస్తరుగా ఉన్నాయి. ఏవీ కూడా చార్ట్ బస్టర్ అయ్యే కేటగిరీలో చేరేట్టు కనిపించడం లేదు. చూస్తుంటే బాస్
పార్టీ మున్ముందు మరింతగా ట్రెండ్ అయ్యేలానే కనిపిస్తోంది. దేవీ పాటలు ఎప్పుడూ స్లో పాయిజన్ అన్న విషయం తెలిసిందే.