తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి తేజ సబ్జా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ సజ్జ కెరియర్ ప్రారంభం లో చై ఆర్టిస్ట్ గా అనేక మూవీ లలో నటించి మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ సినిమా లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే పలు మూవీ లలో హీరో గా నటించిన తేజ సజ్జ "జాంబీ రెడ్డి" మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , హీరో గా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ "హనుమాన్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది.
ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండడం తో ప్రస్తుతం హనుమాన్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే హనుమాన్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయం లో 6.90 మిలియన్ వ్యూస్ ను , 220.2 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే హనుమాన్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అత్యద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. అలాగే హనుమాన్ మూవీ హిందీ టీజర్ కు 24 గంటల్లో 3.91 మిలియన్ వ్యూస్ , 200 కే లేక్ లను సాధించింది. తాజాగా హనుమాన్ మూవీ యూనిట్ విడుదల చేసిన టీజర్ అత్యద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.