వావ్: పుష్ప రీ రిలీజ్.. ఎక్కడంటే..?
అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలలో కాదట కేరళలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు సమాచారం. ఒక డబ్బింగ్ సినిమాను ఈ స్థాయిలో రిలీజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పవచ్చు. పుష్ప సినిమాను కేరళలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి గాను పలు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప సినిమా మలయాళ వెర్షన్ రీ రిలీజ్ కోసం జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఫాహాద్ ఫాజిల్ ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని అక్కడ రీ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కేరళలో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుచేతనే పుష్ప చిత్రాన్ని విడుదల చేసి ఒక ఏడాది కావస్తున్న సందర్భంగా అక్కడ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి పలు సన్నహాలు జరుగుతున్నాయని.. అంతేకాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా రీ రిలీజ్ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉండడంతో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఒక డబ్బింగ్ సినిమా కేరళలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు సాధించడమే గొప్ప అనుకుంటున్న సమయంలో మళ్లీ రీ రిలీజ్ అవ్వడం అంటే అదొక విడ్డూరంగా ఉందంటూ పలు మీడియా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి.