యశోద: సమంతకు దారుణమైన వసూళ్లు?

Purushottham Vinay
టాలీవుడ్  స్టార్  హీరోయిన్  సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. మొదటి 3 రోజులు వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత తన అదిరే పర్ఫార్మెన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ దుమ్మురేపింది. సమంత వన్ వుమన్ షోగా సాగిన ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా కలెక్షన్లతో యశోద బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశోద.. ఓవర్సీస్‌లో కూడా డీసెంట్ వసూళ్లను సాధించింది. ఇదిలా ఉంటే వీకెండ్ తర్వాత కలెక్షన్లపై ప్రభావం పడింది.ఇక అంతా సెట్ అయిపోయిందని అనుకున్నారంతా. అంతలోనే సినిమాకి ప్రమాదం అనేది ముంచుకొచ్చింది. కీలకమైన సోమవారం ఇంకా మంగళవారం రోజుల్లో ఈ సినిమా ఫుల్ గా డ్రాప్ అయింది.సోమవారం నాడు సాధారణంగా ఏ సినిమాకైనా డ్రాప్ అనేది సహజం.



 ఈ యశోద సినిమాకు కూడా అదే ఊహించారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువగా ఈ సినిమా బాగా డ్రాప్ అయింది. సోమవారం రోజున మెయిన్ సెంటర్స్ లో కనీసం 50శాతం ఆక్యుపెన్సీని ఆశించారు మేకర్స్. కానీ కనీసం 30శాతం కూడా దాటలేదు.ఇక మంగళవారం నాడు అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సహజంగా ఉండే డ్రాప్స్ కు తోడు, కృష్ణ గారి అకాలమరణం కూడా యశోద సినిమాపై గట్టిగా పడింది. వైజాగ్, వెస్ట్, కృష్ణాతో పాటు సీడెడ్ లోని కొన్ని ప్రాంతాల్లో కృష్ణ మృతికి సంతాప సూచకంగా థియేటర్లు మూసేశారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఆయన మరణం కారణంగా ఫస్ట్ షోలు ఆపేసారు.దీంతో యశోద సినిమాకు కలెక్షన్లు పడిపోయాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 7 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రావాలి.కానీ వచ్చేటట్టు అసలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: