తమిళ స్టార్
హీరో విశాల్ స్వతహాగా తెలుగువాడే.తాను నటించే ప్రతీ సినిమాని కూడా తెలుగులోనూ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. 'పందెం కోడి' 'పొగరు' 'భరణి' 'వాడు వీడు' 'పల్నాడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' వంటి పలు సినిమాలు
విశాల్ ను ఇక్కడి ప్రేక్షకులని బాగా దగ్గరయ్యాడు. "అభిమన్యుడు"
సినిమా తర్వాత
విశాల్ నటించిన ఏ
సినిమా కూడా తెలుగులో పెద్దగా హిట్ అవ్వలేదు. తనకు ఇష్టమైన
జోనర్ లో చేసిన 'పందెం కోడి 2' 'యాక్షన్' 'చక్ర' 'ఎనిమీ' 'సామాన్యుడు' వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే
విశాల్ తెలుగులో సాలిడ్ హిట్టు అందుకోడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగా ఇప్పుడు "లాఠీ" అనే మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.విశాల్ హీరోగా ఎ.వినోద్
కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లాఠీ'.
ఈ సినిమాలో సునయన
హీరోయిన్ గా నటించింది.
రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై
తమిళ నటులు
రమణ ఇంకా నంద ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. "లాఠీ" సినిమాని పాన్
ఇండియా రేంజిలో అదే టైటిల్ తో తెలుగు
తమిళ్ హిందీ మలయాళం
కన్నడ వంటి పాన్
ఇండియా భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రిస్మస్ పండుగ కానుకగా
డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వస్తుందని ఈ
సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.రజినీకాంత్ లాగే తెలుగు మార్కెట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన విశాల్..
టాలీవుడ్ లో 'లాఠీ' సినిమాకు సంబందించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు.
హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించిన
ఈవెంట్ లో ఈ
సినిమా టీజర్ - ఫస్ట్ సింగిల్ ఇంకా గ్లింప్స్ ని లాంచ్ చేశారు. మరి
విశాల్ ఈసారైనా తెలుగులో హిట్టు కొడతాడో లేదో చూడాలి.