అశ్విన్ "హిడింబ" మూవీ లేటెస్ట్ అప్డేట్..!

frame అశ్విన్ "హిడింబ" మూవీ లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
ప్రముఖ యాంకర్ మరియు దర్శకుడు అయినటు వంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అశ్విన్ "రాజు గారి గది" సిరీస్ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. రాజు గారి గది పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా అశ్విన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. అలా రాజు గారి గది మూవీ మంచి విజయం సాధించడం తో రాజు గారి గది 2 , రాజు గారి గది 3 మూవీ లు కూడా తెరకెక్కాయి.
 

ఈ మూవీ లలో రాజు గారి గది 2 మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. రాజు గారి గది 3 మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా రాజు గారి గది సిరీస్  మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న అశ్విన్ తాజాగా హిడింబ అనే మూవీbలో హీరో గా నటించాడు. అనీల్ కన్నెగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దర్శకుడు అనీల్ కన్నెగంటి ఈ మూవీ ని మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. గత కొంత కాలంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అలాగే మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ లో అశ్విన్ సరసన నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తుండగా , ఎస్ వి కె సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ మూవీ తో అశ్విన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: