నాని ఆఫీసులో రొమాన్స్ చేసిన పాన్ ఇండియా హీరో..!!
ముఖ్యంగా నిర్మాతగా నాని అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి పాట పాడిన శ్రీరామ్ పాటని విడుదల చేయగా మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ పాటకు మరింత వైరల్ చేయాలని అడవి శేషు తో పాటు హీరోయిన్ కూడా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. రొమాంటిక్ లవర్స్ తరహాలో డాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు ఈ జంట.
ఇక హీరో అడివి శేషు నాకు డాన్స్ చేయడం అంటే కాస్త సిగ్గాని కానీ మీ కోసం ఏదైనా చేస్తాను అంటూ క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఆ తరహాలో డాన్స్ చేసింది ఎక్కడో కాదు నాని ఆఫీసులోనే అన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నాని సరదాగా కామెంట్లు కూడా చేయడం జరిగింది నా ఆఫీసును ఇలా కూడా వాడొచ్చా అని నాని తాజాగా ట్విట్టర్లు స్పందించారు. ఇక డైరెక్టర్ స్టైలే స్పందిస్తూ మరి ఆ మాత్రం ఉండాలి అంటే కామెంట్లు చేయడం జరుగుతోంది.