మలయాళం స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ సినిమాకి రచయిత ఇంకా దర్శకుడు కూడా. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చెయ్యనున్నాడని వార్తలు వస్తున్నాయి.తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం కూడా ఉండవచ్చు.చిరంజీవి నుంచి మళ్ళీ మరో మలయాళ రీమేక్ రానుందనే ఈ వార్తా తెగ చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమాకి ముందు నుంచే అభిమానులు మెగా ఫ్యామిలీ రీమేక్‌లు చేయడం పై చాలా అంటే చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా హీరోలు మాత్రం ఈ ఫీడ్‌బ్యాక్‌ని అస్సలు సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. "బ్రో డాడీ" మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన హాస్యభరితమైన సినిమా. అందువల్ల ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ వార్తా ఇంతకు ముందే చాలా సార్లు బాగా వినిపించింది.ఇపుడు మళ్ళీ సినీ వర్గాలలో చర్చ నడుస్తుందని సమాచారం తెలుస్తుంది.అయితే ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అనేది రాలేదు.అయితే ఈ చిరుకి అయితే ఈ సినిమా రీమేక్ చెయ్యాలని ఆసక్తి ఉంది. పైగా ఈ సినిమా చాలా పరిమిత బడ్జెట్‌లో తీయవచ్చు. ఇంకా అంతేకాకుండా కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం కూడా చాలా ఉంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన నటనలోని కామెడీ యాంగిల్‌ని మరోసారి చూపించడానికి ఈ సినిమా చాలా స్కోప్ ఇస్తుంది. చంటబ్బాయి, దొంగ మొగుడు ఇంకా అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లను కూడా మెగా అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా వారి కోరికను తీర్చే ఎంటర్‌టైనర్‌గా మారుతుందని చిరంజీవి భావిస్తున్నాడట.మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో?