అందుకే గ్లామరస్ గా ఉన్న ఫోటోలను పెడుతూ ఉంటా... పూనమ్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. బాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాల తో , నటన తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దు గుమ్మ కు మంచి గుర్తింపు లభించింది.


ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరోగా  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన పరుగు మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లోని పూనం పాత్రకు మంచి గుర్తింపు లభించడం వల్ల ఈ మూవీ ద్వారా పూనమ్ కి  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయమై పూనమ్ స్పందించింది.


దక్షిణాది లో నాకున్న చాలా మంది అభిమానులు నన్ను చాలా గ్లామరస్ గా చూసేందుకు ఇష్టపడుతున్నారు. నా ఫోటోలు చూసి వారు ఎంజాయ్ చేస్తున్నారు  కాబట్టే ఎక్కువగా వాటిని పోస్ట్ చేస్తున్నాను.  కానీ గ్లామర్ షో కి , స్కిన్ షో కి చాలా తేడా ఉంది అని పూనమ్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే పూనమ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసే ఫోటోలలో , చాలా ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: