అయోమయంలో యశోద !

Seetha Sailaja
సమంత కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ‘యశోద’ మూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఈమూవీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీకి సమంత ఇమేజ్ రీత్యా ఏర్పడిన క్రేజ్ తో బిజినెస్ బాగానే జరగడంతో ఈమూవీ బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా గట్టెక్కాలి అంటే ఈమూవీ ఖచ్చితంగా 40 కోట్ల టార్గెట్ కలక్షన్స్ ను చేరుకోవాలి అన్న అంచనాలు వస్తున్నాయి.


ఈమూవీకి వచ్చిన టాక్ రీత్యా ఆ రేంజ్ లో ఈమూవీకి ఈ వీకెండ్ ముగిసే సరికి కలక్షన్స్ వస్తాయా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు వస్తున్నాయి. అయితే ఇండియా క్రికెట్ టీమ్ టి-20 క్రికెట్ టార్నమెంట్ లో ఫైనల్ కు చేరుకోకుండా ఇంటిదారి పట్టడంతో ఈ వీకెండ్ లో మరేమీ వినోదాలు పండుగలు లేవు కాబట్టి ‘యశోద’ కొంతవరకు గట్టెక్కినట్లే అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.


సరోగసి నేపధ్యంలో రూపొందిన ఈమూవీ కథ క్రైం సినిమాలు బాగా ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు నచ్చుతాయి కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ లను ఇష్టపడే సగటు ప్రేక్షకుడు ఈమూవీని టిక్కెట్ పెట్టి వెంటనే చూసేకన్నా మరో నెలరోజులు ఆగితే ఈమూవీని ఓటీటీ లో చూడవచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తే మాత్రం ఈ వీకెండ్ లో ‘యశోద’ కలక్షన్స్ కు గండిపడే ఆస్కారం ఉంది అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. సమంత ఉంది కదా అని ‘ఒబేబి’ లా ఈసినిమా ఉంటుంది అని అనుకుని ఎవరైనా వెళ్ళితే ఈమూవీ నిరాశను కలిగించే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.



‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ సీన్స్ కు ఫిదా అయి ఆమె అభిమానులుగా మారిన వారందరికీ ఈసినిమా నచ్చుతుంది అన్న అభిప్రాయంతో రివ్యూలు వచ్చాయి. దీనితో ఈసినిమాకు వచ్చే ప్రేక్షకులు కేవలం క్రైమ్ సస్పెన్స్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులు మాత్రమే కావడంతో కేవలం వీరి సంఖ్యతో ‘యశోద’ తన కలక్షన్స్ టార్గెట్ ను చేరుకోగలదా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: