వామ్మో: లావణ్య త్రిపాఠి చేతిలో ఇన్ని ప్రాజెక్టులా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తన మొదటి సినిమాతో అందంతో అమాయకపు మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు వెలుపడ్డాయి.అయితే ఈ క్రమంలోనే హీరో నానితో కలిసి భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. కానీ గత కొన్నేళ్లుగా సరైన కథలు ఎంపిక విషయంలో పొరపాట్లు చేస్తూ ఉండడంతో ఈ ముద్దుగుమ్మ బ్లాక్ లిస్టులో చేరిపోయింది.

లావణ్య త్రిపాఠి నుంచి చివరిగా వచ్చిన చిత్రం హ్యాపీ బర్తడే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో లావణ్య త్రిపాఠి కెరియర్ క్లోజ్ అయిందని అందరూ భావించారు. ఇక తర్వాత ఎలాంటి ప్రాజెక్టు కూడా ఇమే తెలియజేయలేదు.దీంతో సినిమాలకు ప్యాకప్ చెప్పేసిందని ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది.కానీ వాస్తవానికి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో కోనా వెంకట దర్శకత్వంలో పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను zee -5 వారు తెరకెక్కిస్తున్నట్లు.. తెలియడమే కాకుండా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

అలాగే తమిళంలో హీరో ఆధ్వర్య కు జోడీ గా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే మరొకవైపు మంజునాథ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఒక సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా మరొక రెండు ప్రాజెక్టులు కూడా ఈమె చేతిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ లావణ్య త్రిపాఠి మాత్రం ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వెల్లడించకుండా చాలా సైలెంట్ గా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహాన్ని కలిగేలా చేస్తోంది.మరి అభిమానుల కోసం అప్డేట్ ప్రకటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: