"నేను స్టూడెంట్ సార్" మూవీ టీజర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ఆ స్టార్ డైరెక్టర్..!

Pulgam Srinivas
తాజాగా స్వాతిముత్యం మూవీ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. స్వాతిముత్యం మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి , షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో , ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. దానితో స్వాతిముత్యం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన మిడిల్ క్లాస్ మెలోడీస్ బ్యూటీ వర్ష బోల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ గణేష్ "నేను స్టూడెంట్ సార్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా  , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. రాఖి ఉప్పలపాటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ను నవంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్ నవంబర్ 12 వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి  ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు , ఈ టీజర్ విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేయునున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి , ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే స్వాతిముత్యం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ హీరో నేను స్టూడెంట్ సార్ మూవీ తో ఏరెంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: