పవన్ కళ్యాణ్ దర్శకుడితో బాలకృష్ణ సినిమా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఆఖరుగా గద్దల కొండ గణేష్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన గద్దల కొండ గణేష్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.


అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న , ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ "భవదీయుడు భగత్ సింగ్" మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. దానితో భవదీయుడు భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ,  దర్శకుడు హరీష్ శంకర్ ఆలోపు వేరే హీరో తో మూవీ ని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలకృష్ణ హీరోగా హరీష్ శంకర్ ఒక మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు , ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: