సూర్య పవర్ ఫుల్ పోలీస్ గా "సింగం - 4"... విలన్ గా ఎవరో తెలుసా?

VAMSI
తమిళ్ సినీ పరిశ్రమలో మనకు నచ్చిన హీరోలలో సూర్య ఒకరు. తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోగా అటు తమిళ్ మరియు తెలుగు లో తన సత్తా చాటుతున్నాడు. సూర్యను ప్రేక్షకులకు ఓన్ చేసుకున్న అతి కొద్ది సినిమాలలో గజినీ మరియు యముడు సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. ఇక యముడు లో సూర్య పోలీస్ గా సృష్టించిన విద్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కడంతో యముడుకు సీక్వెల్స్ ను తీశారు... వరుసగా సింగం 2 మరియు సింగం 3 లు వచ్చి పర్వాలేదనిపించాయి.
ఈ సినిమాలను దర్శకుడు హరి ఎంతో జాగ్రత్త తీసుకుని తెరకెక్కించాడు. ప్రస్తుతం కోలీవుడ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సింగం 4 ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే సూర్య మరియు హరిలు కూర్చుని కథను ఫైనల్ చేశారట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టేలా ఉంది , ఇందుకు కారణం ఇద్దరూ కూడా ఇతర ప్రాజెక్టు లతో బిజీ గా ఉండడమే. అంతా అనుకున్నట్లు జరిగితే... ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవనుంది అని తమిళ సినీ వర్గాలు భావిస్తున్నాయి .
కాగా ఈ సిరీస్ లో పోలీసు పాత్ర పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు హరి. ఈ సినిమాలో ఏ విధంగా సూర్య పొలిసు పాత్రను డిజైన్ చేయనున్నాడని అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా విలన్ విషయంలో కూడా ఆచితూచి అడుగేస్తున్నారన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సూర్యకు విలన్ గా విజయ్ సేతుపతి లేదా అరవింద్ స్వామి లను ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరి చూద్దాం ఈ సినిమా గురించి ఆఫీసియల్ న్యూస్ ఎప్పడు వస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: