యశోద సినిమా ఎలా ఉందో తెలుసా..?
యశోద సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత సమంత సినిమా విడుదల కావడంతో అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇప్పటికే సమంత ఈ సినిమాకు సంబంధించి భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే యశోద సినిమాను చూసినవారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఈ చిత్రంతో సమంత సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ డీసెంట్గా చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తో ఉందంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే సరోగసి ఆస్పత్రిలో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా ఒక మలుపు తిరుగుతుందని చూసినవారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశం ఈ చిత్రానికే హైలెట్గా నిలిచేలా ఉందని సమాచారం. ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా థ్రిల్లింగ్ గా మారిపోయింది అని అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా మారిందని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. సమంత ఎప్పటిలాగానే ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది అని కామెంట్స్ చేస్తున్నారు.