రేటు పెంచేసిన శ్రీ లీల...!!

frame రేటు పెంచేసిన శ్రీ లీల...!!

murali krishna
ఈమధ్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల హవా అయితే తెగ పెరిగిపోయింది. ఒకటి రెండు సినిమాలు హిట్ పడితే చాలు రెచ్చిపోతున్నారట యంగ్ బ్యూటీస్. రేటు  అయితే భారీగా పెంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీలా కూడా మళ్ళీ మరోసారి తన రేటు భారీగా పెంచేసిందట.ఒకప్పుడు హీరోయిన్లకు స్టార్ డమ్ వచ్చి.. ఓ పది సినిమాల పైన పడితేనే రెమ్యూనరేషన్ లో కాస్త మార్పులు చేసేవారట.అప్పటికీ వెనకా ముందు అయితే ఆలోంచించేవారు. కాని ఇప్పుడు కొత్త హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే భారీగా డిమాండ్ చేస్తున్నారట.. ఇప్పుడు వస్తోన్న హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేస్తున్నారు.

 
ఇక యంగ్ క్రేజీ హీరోయిన్ లలో ప్రస్తుతం డిమాండు ఉన్న తారలలో కృతి శెట్టితో పాటు శ్రీలీల కూడా ఉందని తెలుస్తుంది.. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెర ఎంట్రీ ఇచ్చిందట ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా ప్లాప్ అయినా.. శ్రీలీలకు మాత్రం డిమాండ్ అమాంతం పెరిగిపోనయింది. అసలు పెళ్ళి సందడి సినిమా ఆమాత్రం చూశారంటే అది శ్రీలీల వల్లే అని అనుకుంటున్నారు..ఈ సినిమాతో ఆమె డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. మేకర్స్ ఆమె కోసం ఎగబడటం మొదలు పెట్టారు. ఇక ఆమెకు స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వెంట పడుతున్నాయి. అందులో భాగంగా రవితేజ ధమాకా సినిమాతో పాటు బాలయ్య బాబు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీలా. బాలయ్య కూతురుగా నటించబోతోందని సమాచారం..

 
స్టార్ హీరోలు శ్రీలీల వెంటపడి మరీ కావాలి అనడంతో.. మేకర్స్ ఆమె వెంటపడి మరీ తమ సినిమాల కోసం బుక్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.. ఇక ఆమెకు డిమాండ్ పెరగడంతో.. ఆమె కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసిందట. సినిమా సినిమాకు రేటు పెంచుతూ పోతుంది.శ్రీలీల.పెళ్లిసందడి సినిమాకు 20 లక్షల లోపే రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు సినిమా సినిమాకు కోటిన్నర కావాలంటుందట.అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే చెపుతా.. లేకపోతే లేదని ముఖం మీదే చెప్తుంది . ఆమె అలా  డిమాండ్ చేయడంతో మేకర్స్ కూడా షాక్ అవుతున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: