చాలా నెర్వస్ గా ఉంది... సమంత లేటెస్ట్ పోస్ట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అనేక తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా సమంత హిందీ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.


ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప పార్ట్ 1 మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత , ఈ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే గుర్తింపు ను దక్కించుకుంది. ఇలా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. ఈ మూవీ రేపు అనగా నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.


ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యం లో సోషల్ మీడియా వేదికగా సమంత ఒక పోస్ట్ పెట్టింది. తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ... చాలా నెర్వస్ గా ఉంది  , కానీ ఎక్సైట్ అవుతున్న. ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికీ యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మీ తూర్పు కోసం నాలాగే నా దర్శకులు ,  నిర్మాతలు , మూవీ యూనిట్ మొత్తం వెయిట్ చేస్తుంది. అంటూ సమంత లేటెస్ట్ గ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: