బన్నీ..రామ్ చరణ్ ఒకేలా ఆలోచిస్తున్నారా..?

frame బన్నీ..రామ్ చరణ్ ఒకేలా ఆలోచిస్తున్నారా..?

Divya
డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాతో సిద్ధార్థ ఆనందా తో కలిసి ప్రభాస్ ఒక భారీ ప్రాజెక్టును చేయవలసి ఉంది. అంతేకాకుండా సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. rrr సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో 30వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్. ఇలా ప్రభాస్, మహేష్, తారక్ మరొక రెండు సినిమాలతో బిజీగా ఉంటూ తన తదుపరి చిత్రాలను కూడా లైన్లో పెట్టుకున్నారు. కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం కేవలం చెరొక ప్రాజెక్టును మాత్రమే చేస్తూ ఉన్నారు. rrr సినిమాతో జాతీయ స్థాయిలో క్రియేషన్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం కేవలం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు.


ఇక తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిమ్మినూరు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి అంగీకరించారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు పలు కారణాల చేత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు సమాచారం.ఇక తర్వాత ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారని విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2 సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయాలనుకున్న ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఊసే లేదు. అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తప్ప మరొక ఏ సినిమాకి సైన్ చేయలేదన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: