మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఏ మాత్రం ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకో ప్రేక్షకులు ఆ సినిమాను థియేటర్లలో చూసేందుకు అసలు ఆసక్తి చూపించలేదు. అయితే మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ కెరియర్లో సన్నాఫ్ ఇండియా సినిమా భారీ డిజాస్టర్ సినిమా అని అనుకుంటుంటే జిన్నా సినిమా ఆ సన్నాఫ్ ఇండియా సినిమాని డిజాస్టర్ రేస్ లో వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిందని అంటున్నారు. నిజానికి సన్నాఫ్ ఇండియా సినిమా ఒక ప్రయోగంగా రూపొందింది. కేవలం ఒకే మనిషితో సినిమా చేస్తే ఎలా ఉంటుందని అనే ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది.అయితే ఆ సినిమాలో మోహన్ బాబు ఒక్కడే నటించాడు కాబట్టి పెద్ద ఖర్చు కూడా కాలేదు. కేవలం డైరెక్టర్ అండ్ టీం మాత్రమే రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసే ఉద్దేశంలో బండ్ల గణేష్ అలీ సహా ప్రగ్యా జైస్వాల్ వంటి వారిని కూడా ఈ సినిమాలో నటింప చేశారు. కానీ ఈ నటులందరూ కూడా మోహన్ బాబు కుటుంబానికి చాలా సన్నిహితులైన వారు కావడంతో చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా చేశారు. దీంతో సన్నాఫ్ ఇండియా సినిమా చాలా తక్కువ బడ్జెట్ కి నిర్మితమయ్యి థియేటర్లలో విడుదలైంది. కానీ జిన్నా సినిమా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమా ఖర్చు 20 కోట్ల రూపాయల దాకా అయినట్లు సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు హాట్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా బ్యూటీ పాయల్ రాజ్ పుత్, ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలలో నటించడంతో వీరిద్దరికి కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు.ఈ సినిమాకి కేవలం మైంటెనెన్సు ఖర్చులు మాత్రమే వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.