Rc -15 ఈసారైనా అలాంటివి జరగకుండా చూస్తారా..!!
ప్రస్తుతం రామ్ చరణ్ జపాన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రావడం జరిగింది.దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతూ ఉన్న సమయంలోనే RC -15 సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాజమండ్రిలో తండ్రి పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని గత కొద్ది రోజుల క్రితమే చిత్ర బృందం పూర్తి చేశారు. ఆ తర్వాత అమృత్ సర్ పాటు హైదరాబాదులోనూ కూడా పలు కీలకమైన ఘట్టాలను చిత్రీకరించారు. దీంతో కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆ తరువాత కమలహాసన్ తో శంకర్ ఇండియన్ 2 సినిమానీ మళ్లీ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది.ఈ సినిమాకు సంబంధించి కీలకమైన ఘట్టాల షూటింగ్ జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాంచరణ్ సినిమాకు సంబంధించి నవంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర బృందం విదేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇప్పటివరకు లీకైన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ లిక్ లా కారణం చేత చిత్ర బృందం చాలా ఇబ్బంది పడుతోంది. దీంతో చిత్ర బృందం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి లీకులు తలెత్తకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో సక్సెస్ అవుతారెమో చూడాలి.