యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి .
ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీ ని మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ని 9 భాషలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ అదిరిపోయే స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ యూనిట్ జాన్వీ కపూర్ ను సంప్రదించగా ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో హీరోయిన్ గా నటించడానికి జాన్వి కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందపోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నెల తర్వాత ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.