నన్ను అతను అన్ని రకాలుగా వాడుకున్నాడు : ఎస్తేర్
అయినా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే ఇద్దరూ కలిసి కూర్చొని పరిష్కరించుకొని సర్దుకోవాలని అనుకోవటం లేదు. ఇద్దరు మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారట . ఇది సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా పెళ్లయిన ఆరు నెలలకే విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. ఈ జంటది పెద్దలు కుదిర్చిన వివాహం.. అంతా బాగానే ఉంది అనే లోపే వారిద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారట.
అయితే విడిపోవటానికి కారణాలు చెప్పారు కానీ విడిపోయిన తర్వాత నిందలు వేయటానికి రెడీ అవుతారు. ఇక విడిపోవడానికి ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. కానీ నోయల్.. ఎస్తేర్ తో విడిపోయి ఆమెపై నిందలు వేసి నెగిటివ్ ప్రచారం చేశాడంటూ కూడా ఎస్తేర్ ఆరోపించారు. నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. విడాకుల తర్వాత బిగ్ బాస్ కి వెళ్లిన నోయల్ విడాకుల ఇష్యుని సానుభూతి కోసం వాడుకున్నాడు. అది చూసిన తర్వాత ఇలా కూడా చేస్తారా అని అనిపించింది.
అసలు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను.. కానీ నన్ను నోయల్ బాగా బ్యాడ్ చేస్తున్నాడు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నాడు. అలాగే ట్రోల్స్ మెసేజ్లు ఎక్కువ అవ్వటంతో ఇక్కడ మీడియాకు నేను సమాధానం చెప్పాలని ఎదురు చూడటంతో మళ్లీ త్రీ ఇయర్స్ తర్వాత తెలుగు సినిమా చేసి.. ఇక్కడికి వచ్చాక మళ్లీ ఈ ఇష్యూ గురించి మాట్లాడాను అని ఎస్తేర్ అన్నారట. ఆరు నెలల తర్వాత విడాకులు తీసుకున్న ఇద్దరం కలిసి ఉన్నది కేవలం 16 రోజులు మాత్రమే కానీ ఈ విషయం చెప్తే ఎవరూ నమ్మరు తప్పులు అనేటివి ఇద్దరి సైడ్ నుంచి ఉంటాయి కానీ ఒకరిని నిందించటం తప్పు అంటూ ఎస్తేర్ తన మాటల్లో చెప్పారట..