మొన్న సామ్..నేడు మరో హీరో..అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరో..

Satvika
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది అరుదైన వ్యాధుల బారిన పడుతూ ఇబ్బందులను ఎదుర్క్కొంటున్నారు.. చాలా మంది ప్రముఖ నటులు అరుదైన వ్యాధులతో చికిత్స పొందుతూ చనిపొయారు.. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తారలకు సంబంధించిన అరుదైన వ్యాధులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత తాను ఓ అరుదైన వ్యాధి తో బాధపడుతున్నా అని చెప్పిన విషయం తెలిసిందే..మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోంది.


అలాగే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు అనుదీప్. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూడా తనకు ఓ వ్యాధి ఉందని తెలిపాడు. బాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ ధావన్. బ్యాక్ టు బ్యాక్ లతో స్టార్ హీరోగా ఎదిగాడు ఈ యంగ్ హీరో.. ఈ వరుణ్ నటించిన భేధియా అనే రిలీజ్వె అయ్యింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ.. స్టిబ్యులర్ హైపో ఫంక్షన్ డిజార్డర్‌ తో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు.


 వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబందించిన వ్యాధి. చెవిలోపల లైనింగ్‌ లో సమస్య ఉన్నప్పుడు అది కళ్లు తిరగడం, చూపు మసకబారడం, నడిచేటప్పుడు చూపు సమస్యలు వంటి కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ కొంతమందిలో ఒక చెవి లో సమస్యగా ఉంటుంది. కానీ మరికొంతమందిలో ఈ లక్షణం తలలో ని భాగాల్లో కూడా కనిపిస్తుంది. అలాగే వికారం, విరేచనాలు, వాంతులు, ఆందోళన, భయం , గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని వాటి లక్షణాలు తీవ్ర భాదలను కలిస్తాయని నిపుణులు అంటున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: