ఇక ఎట్టకేలకు మెగా కాంపౌండ్ కిడ్ అయిన అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.గతంలో వరుసగా ప్లాపులతో సతమతం అవుతున్న ఈ హీరో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ రస్తు శుభమస్తు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కానీ అతని కెరీర్ కి అదే హిట్టుగా మిగిలింది.చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలందరికి కూడా మంచి మంచి హిట్లు దక్కాయి. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పుష్ప సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఇక శిరీష్ పరిస్థితి ఏంటా అనుకుంటున్న టైంలో ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సంపాదించింది.ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే వారం ఆగితే కానీ క్లీన్ హిట్ అని చెప్పలేం. ఈ సినిమాకి వసూళ్లు వస్తేనే పూర్తిగా హిట్ అయ్యే అవకాశం వుంది.ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ మెగా హీరో ఇక మున్ముందు రోజుల్లో ఇంకా హిట్లు అందుకుంటాడో లేడో చూడాలి.