తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులను మోసం చేస్తున్నారా..!!
తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడి పేరుతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇక వీటితో పాటే తమిళ హీరో శివ కార్తికేయ అని కూడా తెలుగు దర్శకుడు అనుదీప్ కేవితో భైలింగ్వీల్ మూవీగా ప్రిన్స్ సినిమాని విడుదల చేశారు. ఇటీవల ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలై..భైలింగ్వీల్ మూవీ కాదని కేవలం తమిళ సినిమా అని తేలిపోయింది. కేవలం తెలుగులో అనువాదం చేసి విడుదల చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక వీరిద్దరూ తరహాలో తెలుగు దర్శకుడితో తమిళ హీరో ధనుష్ సార్ సినిమాని కూడా తమిళంలో వాతి అనే పేరుతో తెరకెక్కించారు.
ఒక గంట కొంతకాలంగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ ఇటీవల తిరు సినిమాతో మొదటిసారిగా రూ 100 కోట్ల క్లబ్లో చేరడం గమనార్హం. ఇక సార్ మూవీని తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరి పెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్తమేనా నటిస్తున్నది ఈ సినిమా కూడా తెలుగు దర్శకనిర్మాతలు చేస్తున్న తమిళ సినిమాని అని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. డిసెంబర్-2 వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ సమయానికి విడుదల అయ్యే అవకాశాలు లేవని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరిచిత్రబంధం ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.